అఖిల్ కోసం నాగార్జున వదిలేశాడు..

తాత తెలుగు ఇండస్ట్రీలో గొప్ప స్టార్.. తండ్రి తాత వారసత్వాన్ని నిలబెడుతూ అగ్రహీరోగా ఉన్నారు. అన్నయ్యసైతం హీరోగా రాణిస్తున్నారు. ఇన్ని హంగులు, ఆర్భాటాలున్నా కూడా నాగార్జున తనయుడు అఖిల్ కు కాలం కలిసిరావడం లేదు. ఎంతో ముచ్చటపడి పక్కాగా కథను సిద్ధం చేసి వినాయక్ చేతిలో పెట్టి సినిమా తీశారు.కానీ తొలి సినిమానే బిగ్గెస్ట్ ప్లాప్ అయి అఖిల్ ను, నాగార్జునను కోలుకోకుండా చేశాయి. దీంతో అఖిల్ రెండో సినిమా విషయంలో నాగార్జున పక్కాగా ముందుకు వెళుతున్నాడు. చాలా కథలు వింటున్న హిట్టయ్యే అవకాశం ఉంటేనే ఓకే చెబుతున్నాడట..

ఈ వరుసలోనే ఇష్క్, మనం, 24 వంటి విభిన్న కథలతో భారీ హిట్ లు కొట్టిన విక్రమ్ కుమార్ చెప్పిన కథ నాగార్జున బాగా నచ్చింది. అఖిల్ సినిమా కథ నచ్చినా పలు మార్పులు చూయించిన నాగార్జున దీంతో ఇక కథలో తాను ఇన్ వాల్వు కావొద్దని నిర్ణయించుకున్నారట.. విక్రమ్ కుమార్ గొప్ప దర్శకుడిగా నిరూపించుకోవడంతో ఆయనపై భారంవేసి పూర్తి స్వేచ్ఛనిచ్చాడట.. ‘ఏం చేస్తావో.. ఎలా తీస్తావో అంతా నీ ఇష్టం.. నేను కానీ, అఖిల్ కానీ సినిమా కథ విషయంలో తీయడంలో జోక్యం చేసుకోం.. కానీ ఈ సినిమా ఖచ్చితంగా హిట్ అవ్వాలని’ విక్రమ్ కుమార్ చెప్పి ముందుకెళ్లమని చెప్పాడట నాగార్జున..

చిన్న కొడుకు అఖిల్ జీవితం విషయంపై నాగార్జున ఆందోళనగా ఉన్నాడు. ఈ మధ్యే అఖిల్ పెళ్లి క్యాన్సల్ అయిపోయి బాధలో ఉన్నాడు. అటు సినిమాలు ప్లాప్ అయ్యి.. ఇటు జీవితంలో ఎదురుదెబ్బలతో బాగా డీలా పడిపోయారు. ఈ నేపథ్యంలోనే విక్రమ్ కుమార్ కథ చెప్పడం.. బాగుండడంతో నాగార్జున వెంటనే సెట్స్ పైకి తీసుకెళ్లమనడం చకచకా జరిగిపోయాయి.

To Top

Send this to a friend