అక్టోబర్ 7న ‘మనవూరి రామాయణం’

manavoori-ramayanam-apnewsonline

జాతీయ ఉత్తమనటుడు ప్రకాష్ రాజ్ స్వీయ నిర్మాణ దర్శకత్వంలో ‘ప్రకాష్ రాజ్ ప్రొడక్షన్స్, ఫస్ట్ కాపీ పిక్చర్స్’ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం ‘మనవూరి రామాయణం’. 

అక్టోబర్ 7న విడుదలకు సిద్ధమైన ఈ చిత్రం గురించిన వివరాల్లోకి వెళితే .

శ్రీ రామనవమి పండగరోజున జరిగే ఒక సంఘటనతో ఈ ‘మనఊరి రామాయణం’ చిత్ర కథ నడుస్తూ ఉంటుంది. ఈ కథ రామాయణం ఇతివృత్తానికి దగ్గరగా ఉంటుంది. రాముడి రూపంలో ఉండే రావణుడి కథే ఇది. ఈ చిత్ర కధనం అంతా కూడా వ్యక్తుల భావోద్వేగాల చుట్టూ తిరుగుతూ ఉంటుంది.

భుజంగయ్య (ప్రకాష్ రాజ్) అనే వ్యక్తి దుబాయ్‌లో బాగా సంపాదించి వచ్చి ఇక్కడ ఓ ఊరిలో బిజినెస్‌ పెట్టుకుంటాడు. చిత్రం లో సుశీల (ప్రియమణి), ఆటోవాలా శివ (సత్యదేవ్) ల తో పాటు ఎప్పటికైనా భుజంగయ్య దుబాయ్‌కి పంపిస్తాడనే ఆశతో ఆటోవాలా ఉంటాడు. గరుడ అనే డైరెక్టర్‌కు (పృథ్వి) మంచి సినిమా తీయాలని వస్తాడు. భుజంగయ్య, సుశీల, ఆటోవాలా, గరుడ అనే నలుగురి మధ్య ఈ కథ నడుస్తూ ఉంటుంది. వీరిమధ్య నడిచే భావోద్వేగాలు, ఒక్కొక్కరు ఎవరికి వారు ఎలా తమ జీవితాన్ని తమ తమ పరిధిమేరకు నడిచారో, పరిస్థితులకు తగ్గట్టుగా ఎలా మారారో తెలుపుతుంది.

ఈ నలుగురికి పాత్రల చుట్టూ తిరుగుతూనే రామాయణంలో జరిగిన సంఘటనలను గుర్తు చేస్తూ వారి వారి జీవితాలు నడుస్తూ ఉంటాయి

హరికథలో చెప్పిన విధంగా రావణుడు రాముడిగా మారినప్పుడు హనుమంతుడితో రాముడిని చంపమని సీత చెప్పినపుడు ఏమీ చేయలేని స్థితిలో ఉంటాడా..! రాముడిని చంపాడా..! అనే విధంగా ఈ పాత్రల చుట్టూ కథ నడుస్తూ ఉంటుంది అదే మనఊరి రామాయణం.

ప్రకాష్ రాజ్ స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్నటువంటి ద్విభాషా చిత్రం  మన ఊరి రామాయణం (తెలుగు)  ఇదొల్లె రామాయణ (కన్నడ ) .  ఈ సినిమాని హైదరాబాద్ లోని షాద్ నగర్, రామోజీ ఫిల్మ్ సిటీ మరియు కర్ణాటక కూర్గ్ పరిసర ప్రాంతాల్లో చిత్రీకరించారు. జాతీయ అవార్డు గ్రహితులైనటువంటి సంగీత దర్శకుడు మాస్ట్రో ఇళయరాజా, ప్రకాష్ రాజ్, ప్రియమణి,ఎడిటర్ శ్రీకర్ ప్రసాద్, కళా దర్శకుడు శశిధర్ ఆడప, వంటి కళా నిపుణులు ఈ చిత్రానికి వర్క్ చేయటం విశేషం. 

మాస్ట్రో ఇళయరాజా సంగీతం ఈ చిత్రానికి పెద్ద ఎస్సెట్. ఇటీవలే సెన్సార్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ‘యు’ సర్టిఫికెట్ పొందింది. ప్రముఖ చిత్ర డిస్ట్రిబ్యూషన్ సంస్థ ‘అభిషేక్’ పిక్చర్స్ ద్వారా అక్టోబర్ 7న  రెండు తెలుగురాష్ట్రాల ప్రేక్షకులను అలరించటానికి ‘మనవూరి రామాయణం’ వస్తోందని తెలిపారు ‘ప్రకాష్ రాజ్’ 

ప్రకాష్‌ రాజ్‌  ,ప్రియమణి,సత్యదేవ్‌ (జ్యోతిలక్ష్మి ఫేమ్), పృథ్వీ,

రఘుబాబు.

కథ : జాయ్ మాథ్యూ, మాటలు : రమణ గోపిశెట్టి, ప్రకాష్ రాజ్

సాహిత్యం : భాస్కరభట్ల రవికుమార్, ఆర్ట్ : శశిధర్ అడప

ఎడిటర్ : శ్రీకర్ ప్రసాద్ ,సినిమాటోగ్రఫీ : ముకేశ్

సంగీతం : మాస్ట్రో ఇళయరాజా

నిర్మాతలు : ప్రకాష్ రాజ్, రామ్ జీ

స్క్రీన్ ప్లే- దర్శకత్వం : ప్రకాష్ రాజ్ 

To Top

Send this to a friend