అక్టోబర్‌ 1న వస్తోన్న నాగశౌర్య ‘నీ జతలేక’

Nee Jataleka006

ప్రముఖ వ్యాపారవేత్త జి.వి. చౌదరి శ్రీ సత్యవిదుర మూవీస్‌ బ్యానర్‌ను స్ధాపించి తొలి ప్రయత్నంగా యంగ్‌ సక్సెస్‌ఫుల్‌ హీరో నాగశౌర్యతో ‘నీ జతలేక’ చిత్రాన్ని నిర్మించారు. పారుల్‌ గులాటి మీరోయిన్‌గా లారెన్స్‌ దాసరి దర్శకత్వంలో జి.వి. చౌదరి, నాగరాజుగౌడ్‌ చిర్రా సంయుక్తంగా రూపొందించిన ఈ చిత్రం ఆడియో ఆల్‌రెడీ విడుదలై సూపర్‌హిట్‌ అవడమే కాదు ప్లాటినం డిస్క్‌ను కూడా సాధించింది. అలాగే ఈ చిత్రం థియేట్రికల్‌ ట్రైలర్‌కి టెరిఫిక్‌ రెస్పాన్స్‌ రాబట్టుకున్న ఈ చిత్రం అక్టోబర్‌ 1న గ్రాండ్‌ రిలీజ్‌ అవుతోంది. ఈ సందర్భంగా….

నిర్మాత జి.వి. చౌదరి మాట్లాడుతూ – ”ఇప్పటి వరకు ఎన్నో ప్రేమకథలు వచ్చాయి. కానీ మా చిత్రంలోని ప్రేమ కథ చాలా కొత్తగా ఉంటుంది. ఇలాంటి కథ స్క్రీన్‌పై రావడం ఇదే ఫస్ట్‌టైమ్‌. ఈ చిత్రం టైటిల్‌ కథకి పర్‌ఫెక్ట్‌ యాప్ట్‌. ఇప్పటివరకు నాగశౌర్య చేసిన చిత్రాలన్నిం టికంటే ఈ చిత్రం చాలా డిఫరెంట్‌గా ఉంటుంది. ప్రతి సీన్‌ చాలా ఫ్రెష్‌గా ఉంటుంది. లారెన్స్‌ దాసరి కథ చెప్పిన దానికంటే సినిమా బాగా తీశాడు. విస్సు కె. కెమెరా వర్క్‌ ఎక్స్‌ట్రార్డినరీగా చేశారు. స్వరాజ్‌ సంగీతం, శేఖర్‌ విఖ్యాత్‌ సంభాషణలు, రఘు మాస్టర్‌ కొరియో గ్రఫి, లారెన్స్‌ దాసరి డైరెక్షన్‌ సినిమాకు హైలైట్స్‌గా నిలు స్తాయి. ఈ సినిమాతో ఇండస్ట్రీలో సక్సెస్‌ఫుల్‌ నిర్మాతగా రాణిస్తానని పూర్తి కాన్ఫిడెంట్‌తో ఉన్నాను. ఫ్యామిలీ ఆడి యన్స్‌ అందరికీ నచ్చే ప్యూర్‌ ఫిల్మ్‌. 175 థియేటర్లుకు పైగా అక్టోబర్‌ 1న గ్రాండ్‌గా చిత్రాన్ని రిలీజ్‌ చేస్తున్నాం” అన్నారు.

నిర్మాత నాగరాజు గౌడ్‌ చిర్రా మాట్లాడుతూ – ”ప్రేక్ష కులు ఎంటర్‌టైన్‌ అయ్యేలా ‘నీ జతలేక’ చిత్రాన్ని నిర్మిం చాం. చాలా స్టైలిష్‌గా వుంటుంది. సాంగ్స్‌ పిక్చరైజేషన్‌ అద్భుతం. ప్రతి సీన్‌ చాలా ఫ్రెష్‌గా వుంటుంది. నాగ శౌర్య ఈ చిత్రంలో న్యూ లుక్‌లో కనబడతాడు. దాసరి లారెన్స్‌ సినిమాని చాలా బాగా తెరకెక్కించారు. అన్ని కమర్షియల్‌ ఎలిమెంట్స్‌ వున్నాయి. ఈ చిత్రం నాగ శౌర్యకి సూపర్‌హిట్‌ చిత్రం అవుతుంది. అక్టోబర్‌ 1న ఈ చిత్రాన్ని గ్రాండ్‌గా రిలీజ్‌ చేస్తున్నాం” అన్నారు.

To Top

Send this to a friend