అందరి సపోర్ట్ తీసుకున్నా బాలయ్యకు క్రెడిట్ ఎందుకు రాలేదు..?

GPSK

వెంకయ్య పాదాల చెంత బాలయ్య తన శాతకర్ణి మూవీ ఆడియో వేడుకను ఘనంగా నిర్వహించారు. అభిమానులు ఓ మోస్తారుగానే హాజరయ్యారు.. ఏపీ ప్రభుత్వంలో ఎమ్మెల్యే, చంద్రబాబు వియ్యంకుడు కావడంతో దీనికి బాగా హైప్ తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. ఏపీ సీఎం చంద్రబాబు, బీజేపీ కేంద్ర వెంకయ్యనాయుడు వచ్చి బాలయ్యను సినిమాను వేయినోళ్ల పొగిడారు.. మీడియాలో కూడా విపరీత ప్రచారం చేశారు.. తన సినిమా ప్రమోషన్ విషయంలో బాలయ్య చాలా జాగ్రత్తలు తీసుకున్నారు.. శాతకర్ణి మూవీ ప్రారంభోత్సవాన్ని తెలంగాణ సీఎం కేసీఆర్ చేత నిర్వహించి వారి మద్దతు కూడగట్టారు. అనంతరం బావ చంద్రబాబుతో తిరుపతిలో ఆడియో ఫంక్షన్ నిర్వహించిన ఏపీ అధికార పార్టీ సపోర్ట్ ను ఉందని నిరూపించారు. అనంతరం తెలంగాణ సీఎంను కలిసి తన సినిమాకు వినోద పన్ను మినహాయింపును పొందారు. ఆ వార్తను మీడియాలో నాన్చి ప్రచారం చేసుకున్నారు..కాని న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్ లొ ఓక్క డిజిటల్ హోర్దింగ్ పెట్టటానికి 25 లక్షలు నెలకు చెల్లించి శాతకర్ణి సినిమాకు అంతర్జాతీయ ఖ్యాతిని తెచ్చే ప్రయత్నం చేసె ఈ సినెమాకు వినొదంపన్ను రాయితి అవసరమా? . ఇన్ని చేసినా చిరు సినిమా పోటీగా ఉండడంతో అభిమానుల మధ్య సివిల్ వార్ నడిచింది.. చిరు, బాలయ్య సినిమాలు పోటాపోటీ గా రావడంతో ఇద్దరి సినిమాలపై అటు విశ్లేషణలు.. అంచనాలు పోటెత్తాయి.. అందుకే సినిమా ప్రమోషన్లలో చిరుకు అడ్డంకులు ఎదరుయ్యాయని ఆయన ఫ్యాన్స్ మదనపడిపోతున్నారు..

కాగా బాలయ్య కు టీడీపీ, బీజేపీ, తెలంగాణ టీఆర్ ఎస్ సపోర్ట్ చేసినా రాని ఇమేజ్ ను నిన్న హ్యాయ్ లాండ్ లో చిరు 150 వ సినిమా ఆడియో ఫంక్షన్ తో సొంతం చేసుకున్నారని విశ్లేషకులు అంచనావేస్తున్నారు. ఆయన ఫంక్షన్ కు వచ్చిన అభిమానులు.. మీడియాలో వచ్చిన క్రేజ్ తో శాతకర్ణి మూవీకి వచ్చిన పబ్లిసిటీ కంటే చాలా ఎక్కువే ప్రచారం వచ్చిందని చెబుతున్నారు. ఎన్ని అడ్డంకులు వచ్చినా ఎక్కడా సంయమనం కోల్పోని చిరుకు అభిమానులు నీరాజనం పలికారని వచ్చిన జనాన్ని చూస్తే అర్థమవుతోంది. బాలయ్యకు సపోర్ట్ ఫుల్ గా ఉన్నా కూడా క్షేత్ర స్థాయిలో అభిమానుల అండ మాత్రం చిరుకే దక్కిందనే అంచనాలు సర్వత్రా వెలువుడుతున్నాయి. చిరు ఫంక్షన్ కు ఎన్ని అడ్డంకులు వచ్చినా ఆయన తన ప్రసంగంలో ప్రస్తావించకపోవడం నిజంగా ఆయన ప్రత్యర్థులకు చెంపపెట్టు.. అభిమానం ఉంటే ఎన్ని అడ్డంకులనైనా ఇజీగా అధిగమించవచ్చని నిరూపించారు చిరు..

To Top

Send this to a friend