అంచనాలు లేని స్థితినుంచి హైప్ దాకా..

కాటమరాయుడు రిమేక్ అని అన్నప్పుడు పవన్ తప్పుచేస్తున్నాడా అని అందరూ సంశయపడ్డారు. దీన్ని మొదట ఎస్ జే సూర్య దర్శకత్వం వహిస్తారన్నప్పుడు అదే సందేహం. ఆ తర్వాత సూర్య పోయి డైరెక్టర్ డాలీ వచ్చాడు. మరింత కన్ఫూజన్.. కానీ సినిమా టీజర్.. ఇప్పుడు మిరామిరా మీసం పాట రిలీజ్ కాగానే పవన్ స్టామినా మరోసారి రుజువైంది. యూట్యూబ్ లో వీటిని లక్షల లైక్ లు, షేర్, వ్యూస్ రావడం పవన్ మేనియా ప్రేక్షకుల్లో పీక్ స్టేజ్ కు పెరిగిపోయింది. ఇప్పుడు పవన్ సినిమా కోసం అందరూ వెయిట్ చేస్తున్నారు..

పవన్ విడుదల చేసిన మిర్రా మిర్రా మీసం పాట ప్రస్తుతం అభిమానులను ఉర్రూత లూగిస్తోంది.. ఇదే జోష్ తో వపన్ చిత్రం యూనిట్ మూడు రోజులకొకటి చొప్పున పాట అయినా పోస్టర్ అయినా ఏదో ఒకటి రిలీజ్ చేస్తూ పవన్ సినిమాపై హైప్ పెంచాలని ప్లాన్ చేశారు.. అంతేకాదు 18న ప్రి రిలీజ్ ఆడియో వేడుక నిర్వహించాలనుకుంటున్నారు.. కాటమరాయుడు విషయంలో పక్కాగా అన్నీ తానై వ్యవహరిస్తున్నారు నిర్మాత శరత్ మరార్.. ఓపెనింగ్స్ భారీగా ఉండేటట్టు ప్లాన్ చేస్తున్నారట చిత్రం యూనిట్.. సో ఈనెలలో విడుదలయ్యే పవన్ సినిమా కోసం అభిమానులు సిద్ధంగా ఉండండి..

పవన్ విడుదల చేసిన మిర్రా మిర్రా మీసం పాట  –

To Top

Send this to a friend